"UPTO DATE" - గా ఉండండి !

up-to-date


అరేబియా సముద్ర తీరం లో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ తన ల్యాప్‌టాప్ మీద పని చేసుకుంటూ ఉండగా తన "పెంటియమ్ ల్యాప్‌టాప్" సముద్రం లో పడిపోయింది. అప్పుడతాడు సముద్ర దేవతను ప్రార్థించాడు.




ఆమె ప్రేత్యక్షం అయ్యీ "నరుడా! ఏమీ నీ కోరిక". అన్నది. అతడు అమ్మా! నా పెంటియమ్ ల్యాప్‌టాప్ నీ ఒడిలో పడిపోయింది. దయచేసి ఆది నాకు తెచ్చి ఇవ్వు అమ్మ" అన్నాడు. సముద్ర దేవత బుడుంగునా మునిగి ఒక అగ్గి పెట్టె తెఛ్హి " ఇది నీదేనా" అని అడిగింది. అతను కాదన్నాడు. ఈ సారి సముద్ర దేవత మునిగి ఒక క్యాలిక్యులేటర్ తెచ్చి " ఇది నీదేనా" అని అడిగింది. అతను కాదన్నాడు. ఈ సారి సముద్ర దేవత ఒక ల్యాప్‌టాప్ తెచ్చి " ఇది నీదేనా" అని అడిగింది. అతను " అవును నాదే అన్నాడు. సముద్ర దేవత అతని నిజాయితీకి మెచ్చుకుని ఈ మూడు తీసుకో అన్నది.

అప్పుడతను "అమ్మా! నీవసలు పంచతంత్ర కథలు చదువలేదు. కట్టెలు కొట్టే వాడి గొడ్డలి పోయినప్పుడు వని నిజాయితీకి మెచ్చుకుని వెండి గొడ్డలి, బంగారు గొడ్డలి , ఇనుప గొడ్డలి ఇచ్చావు. నాకేమో! అగ్గిపెట్టె, కేలిక్యులేటర్, ల్యాప్‌టాప్ ఇస్తున్నావు. ఇవి ఎవడికి కావాలి అన్నాడు కోపంగా! సముద్ర దేవత "ఓరీ వెర్రి వాడా! నాకు పంచతంత్ర కథలన్నీ తెలుసు. నీకు ముందు ఇచ్చిన అగ్గిపెట్టె విలువైన "త్రిల్లీనిుమ్ ల్యాప్‌టాప్" తర్వాత ఇచ్చింది అత్యంత విలువైన "బిలీనిుమ్ ల్యాప్‌టాప్". మూడవది "పెంటియమ్" అనే  నీ చెత్త ల్యాప్‌టాప్ .



ప్రస్తుతం మార్కెట్ లో ఏ ఏ కొత్త కొత్త బ్రాండ్‌లు వస్తున్నాయో అప్‌డేట్ గా ఉండు. లేకపోతే "ఆవుట్‌డేట్ అయిపోతవు" అంటూ ఆ లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ టేసుకుని నీటిలో మునిగి పోయింది.


#source: నింగికి నిఛ్హెన

5 comments:

  1. Replies
    1. ఆర్టికల్ చదివి స్పందించినందుకు ధన్యవాదాలు! Obulareddy గారు.

      Delete
  2. కధలో వెనక్కెళ్ళారు ...
    కంటెంట్లో ముందుకెళ్లారు ...
    ఏమైనా ... భలే చెప్పారు !
    :)

    ReplyDelete
    Replies
    1. nmrao bandi గారికి ధన్యవాదాలు!
      మీ వ్యాఖ్య నాలో చాలా సంతోషం మరియు ఇంకా కొత్త కొత్త ఆర్టికల్స్ రాయాలనే ఉత్సుకత ఎక్కువ అయ్యింది.

      ఇంకో ఆర్టికల్ ఇక్కడ ఉంది చడవగలరు

      https://maapalletur.blogspot.com/2017/09/blog-post.html?m=1

      ధన్యవాదాలు.

      Delete
  3. మీ స్పందన చాలా విలువైనది kondala rao palla గారు. ధన్యవాదాలు.

    ReplyDelete

Powered by Blogger.