విడుకోలు..
రోజుకి వేగం ఎంత ఎక్కువో మనకి ఇలాంటి సమయం లో తెలిసిపోతుంది ,
బంధువులు, భందవ్యాలు,ప్రేమ లు , అల్లర్లు, జ్ఞాపకాలు, మధుర స్మృతులు, ఎన్నో మూట కట్టుకుని బాధ కరమైన మనసు తో వెళ్లాలని లేకున్నా , మల్లి తిరిగి వస్తాం అనే నమ్మకం తో తిరిగి పయనం అవుతారు,,
పిన్ని బాబాయి లు చెప్పే జాగ్రత్తలు, అమ్మ నాన్న లు కట్టించే తిండి వంటలు, అమ్మ కన్నీళ్ల తో బాగా తిను ర అని జాగ్రత్తలు, నాన్న చెప్పే జాగ్రత్తలు తిరగకు ర బయట ఎక్కువ. అమ్మమ్మ , తాతయ్య ల ప్రేమ లు చెప్ప తరమ ..
మల్లి కలుద్దాం !
ఇలాంటి పండుగలు ఎప్పుడు రావాలని విడుకోలు
గమనిక:
నా వాట్సాప్ కి వచ్చిన ఈ భావం. ఇక్కడ రాయడం జరిగింది. ఆథర్ ఎవరో బాగా రాసారు.
పండుగ అయిపోయింది...
సందడి ఆగిపోయింది...
పల్లె మూగపోయింది....
పిల్లల కేరింతలతో కళకళలాడిన పొలం గట్లు దీనం గా చూస్తున్నాయ్....
వీధి చివర వరకు చెయ్యి ఊపి టాటా చెప్పిన అమ్మ మనసులో బాధ కొండంత అయింది.....
జేబు లో డబ్బులు పెట్టి "జాగ్రత్త రా నాన్న!!" అంటూ తిడుతూ జాగ్రత్తలు చెప్పే నాన్న నోట మాట లేదు....
సందడి అంతా మాదే అంటూ పాటలు పాడిన హరిదాసులు చెదిరిపోయారు.....
పందెం కోళ్ల బరులు సర్దేశారు....
సెలవులు ముగించుకుని పట్టణానికి బయలుదేరిన విద్యార్థులు ఏదో కోల్పోయిన భావన లో ఉన్నారు.....
ఇన్ని నాళ్ళు ముగ్గులతో కళాకళలాడిన వీధులు ఇప్పుడు అవే రధాల ముగ్గులతో టాటా చెప్తున్నాయి....
అయినా సరే మీ కోసం ఈ పల్లెటూరు ఎదురు చూస్తూ ఉంటుంది.
ఆ కేరింతలు మల్లి వస్తాయిలే అన్న భరోసా తో మీ కోసం వేచి చూస్తూ ఉంటుంది.
ఎక్కడికెళ్లినా ఈ పల్లెటూరుని మరువకండి.
మన మూలాలు బలంగా ఉండాలి.
మన పల్లెటూరు బాగుండాలి.
ఎందుకాంటే పల్లెలే దేశానికీ పట్టుకొమ్మలు.....
జాగ్రత్తగా వెళ్లి రండి. ఇక్కడ మీ కోసం కొన్ని ప్రాణాలు ఎదురు చూస్తున్నాయ్....
No comments: