పాసిటివ్ ఆటిట్యూడ్ ని కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనం?

పాసిటివ్ ఆటిట్యూడ్ఒక మినరల్ వాటర్ కంపనీ వారు రాయలసీమలో తమ ఉత్పత్తులను అమ్మాడానికి ఎంత అవకాశం ఉందో సర్వే చేయమని ఒక ఎగ్సిక్యుటివ్కు బాద్యతలు అప్పగించారు.

అతడు పదిహేను రోజుల పాటు రాయలసీమ ప్రాంతం లో పర్యటించి "ఇక్కడ తాగడానికి నీళ్ళు లెవు. తినడానికి తిండి లేదు. ప్రజలు దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితి లో మన మినరల్ వాటర్ అమ్మడం సాద్యం కాదు" అని రిపోర్ట్ ఇచ్చాడు.
కంపనీ వారు అదే పనిని మరో ఎగ్సిక్యుటివ్కు పురమాయించారు. అతడు పదిహేనురోజులు రాయలసీమలో తిరిగి "ఇక్కడ తాగడానికి నీళ్ళు దొరక్క, ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గుక్కెడు నీటి కోసం ఎంత డబ్బు వెచ్చించడానికైన సిద్దంగా ఉన్నారు. మనకు మంచి మార్కెట్ అవకాశాలు ఉన్నాయి." అని రిపోర్ట్ పంపించాడు. ప్రాంతం ఒకటే. కానీ రెపోర్ట్‌లు రెండు రకాలుగా వచ్చాయి. ఎందుకు? వ్యక్తుల ఆటిట్యూడ్ లో ఉన్న తేడా వల్ల, పాసిటివ్ ఆటిట్యూడ్ కల వాళ్ళు ఆఫ్రికా అడవుల్లో కూడా అవకాశాలు సృస్టించుకుంటారు. బట్టపూర్రేల వారిచేత కూడా దువ్వెనలు కొనిపిస్తారు. ఎస్కిమోలకు కూడా ఐస్క్రీమ్ లు అమ్ముతారు.

#source: నింగికి నిఛ్హెన

No comments:

Powered by Blogger.