Dignity Of Labour!ఇప్పటి మహానుభావులు అప్పుడు ఏం చేసారో చూడండి?


dignity of labour

ఒకసారి ఒక నది వద్ద డ్యామ్ నిర్మాణం సాగుతుంది. నలుగురు కూలీలు ఒక బండ రాయిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అది వారివల్ల కావడం లేదు. మరొక్క మనిషి చెయ్యి వేస్తే సరిపోతుంది. ఆ ప్రక్కనే ఉన్న ఒక మనిషి బీడి కాలుస్తూ పేపర్ చదువుకుంటున్నాడు. ఆ ధారిన వెళ్తున్న ఒక పెద్ద మనిషి బీడి కాలుస్తున్న మనిషి తో "నీవు వారికి సహాయం చేయవచ్చు కదా" అన్నాడు. దానికి అతడు "మీరు భలే వారే, సూపర్ వైసార్ని , వాళ్ళు చేసే పనిని పరిశీలించాల్ంటే" అన్నాడు. "అలాగా" అని ఆ పెద్ద మనిషి వారికి సహాయం చేసి, వెళ్ళిపోతూ "ఈ సారి మికీలాంటి అవసరం వస్తే చీఫ్ ఇంజినియర్ కు కబురు పంపండి. నా పేరు మోక్ష గుండం విశ్వేశ్వరాయ" అన్నాడు. దాంతో బిడీ కింద పడేసి, క్షమించమని కాళ్ళ మీద పడ్డాడు సూపర్‌వైసర్. విశ్వేశ్వరాయ గారు సహజం గా పెట్టుకునే తలపాగా పెట్టుకొక పోవడం వల్ల ఆయనే చీఫ్ ఇంజినియర్ అని గుర్తించ లేకపోయాడు సూపర్‌వైసర్!


  • మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ కుభేరుడు అయిన బిల్గేట్స్ వాషింగ్టన్ కాంగ్రెస్షనల్ కార్యాలయం లో ఆఫీస్ బోయ్ గా పని చేశారు.


  • T.V.S సంస్థల అధినేత T.V.S సుందరం గా జగత్ విఖ్యాతి గాంచిన "సుందరం" ఆ కంపనీ లో ఒక చిన్న ఉద్యోగిగా అతి తక్కువ జీతానికి పని చేశారు!









  • DELL కంప్యూటర్ అధినేత "మైఖెల్ డెల్" ఒక చైనీస్ రెస్టౌరెంట్ లో గంటకు రెండున్నర  డాలర్లకు అంట్లు తోమారు!
  • పాప్ స్టార్ మడోన ఒక ఫుడ్ షాప్ లో సేల్స్ గర్ల్ గా పని చేసి డోనట్స్ మొదలైనవి అమ్మెవారు!
  • హోటెల్ వ్యాపార రంగం లో ప్రముఖుడైన "ఎమ్. ఎస్. ఒబెరాయ్" చిన్న హోటెల్ లో రిసెప్షనిస్ట్ గా పని చేశారు!
  • నిర్మా పౌడర్ తో పెద్ద వ్యాపార వేత్తగా అనూహ్యం గా ఎదిగిన "కర్సన్ భాయ్ పటేల్" నెలకు పదిహేను వందల రూపాయల జీతానికి ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేశారు!
  • పాప్ సింగర్ "రొడ్స్టివార్ట్" ఇంగ్లెండ్ లో సమాధులు తవ్వారు. వీధి పాటగాడిగా సంగీత ప్రపంచం లో పాదం మోపాడు!
  • రిలయన్స్ అధినేత ధీరూభాయ్ ఆంబానీ గుజరాత్ లోని "మౌంట్‌గిరీనార్" లో భక్తులకు తిను బండారాలు అమ్మారు. ఒమన్ గ్యాస్ స్టేషన్ అటెండార్ గా పనిచేశారు. పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ లో పెట్రోల్ పట్టారు!
  • సైంటిస్ట్ థామస్ ఆల్వా ఎడిసన్ రైళల్లో పేపర్ లు అమ్మెవారు!

  • ప్రపంచాన్ని గడగడ లాడించిన నరరుప రాక్షసుడు ఏడాల్ఫ్ హిట్లర్ చిన్నప్పుడు పొట్ట చేత పట్టు కుని జీవనాధారం కోసం పోస్ట్ కార్డుల మీద పేంటింగ్ లు వేస్తూ హాస్టల్ల చుట్టూ, బోర్డింగ్ హౌస్ ల చుట్టూ తిరిగాడు!
#source: నింగికి నిఛ్హెన

No comments:

Powered by Blogger.