Kiki Challenge గురించి కొన్ని విషయాలు..!


Kiki challenge Jaipur police

Pic source: jaipurpoliceofficial facebook page
ఆధునిక ప్రపంచం లో కొత్త తరహా ఏయ్ ఆలోచన అయిన సమాజం లో పెనుమార్పులు తీసుకొస్తున్నాయి అనడం లో సందేహం లేదు.

అసలు ఏంటంటే ఈ మధ్య సోషల్ మీడియా లో వచ్చిన వింత పోకడలు అనాలో, లేదంటే పని లేని తనం మనిషి గుర్తించి తనకు తానే పనిని సృష్టించే పనిలో భాగం గా ఇలాంటివి తయారవుతున్నాయో అర్థం అవ్వటం కొద్దిగా కష్టమే.



ఇటీవలి రోజుల్లో kiki ఛాలెంజ్   అనేది చాలా ప్రాచుర్యం పొందింది. దీనికి మరింత ఊతం గా బాధ్యత గా వ్యవరించాల్సిన సెలెబ్రెటీల సైతం వీటిని అనుసరిస్తున్నారు.

Kiki ఛాలెంజ్ అనగా! 

ఇది ఒక రకమైన డాన్స్ లాంటిది. ఈ ఛాలెంజ్ ని తీసుకునే వ్యక్తి ఏదొక వాహనం పై నుంచి కదులుతూ ఉండగా దిగి రోడ్ పైన సెల్ఫీ వీడియో తీసుకుని upload చేయడం.


Kiki ఛాలెంజ్ వల్ల ఉపయోగం:

నాకయితే ఏయ్ విధమైన లాభం లేదు అనిపిస్తుంది. మీకేమైనా అనిపిస్తే కామెంట్ చేయండి.

Kiki ఛాలెంజ్ ఆవిర్భావం:

పాశ్చత్య దేశ కమేడియన్ shiggy kick అనే అతను జూన్ లో చేసిన ఈ గణకార్యానికి పెద్ద అనూహ్య స్పందన వచ్చి ప్రాణాల పైకి తెస్తుంది అని తెలుసుకుని ఈ పాటికి సిగ్గుతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటాడు.

గమనిక: kiki ఛాలెంజ్ చేయకూడదు అని పోలీస్ వ్యవస్థ చాలా కఠినం గా హెచ్చరిస్తోంది. పిచ్చి ఛాలెంజ్ లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి.

వార్తల్లో వ్యక్తులు:

1.తెలంగాణలో ఇద్దరు రైతులు దీనిని చేసి అమెరికా దేశం నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. కానీ వాళ్ళు రైతులు కాబట్టి భిన్నం గా చేశారు.


2.పిచ్చి ముదిరితే ఎం చేయలేము, ఇదే ఛాలెంజ్ తీసుకుని కదులుతున్న రైల్ బండి నుంచి kiki డాన్స్ వేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు , అంతే న్యాయస్థానం కోపం తో ఛాలెంజ్ తీసుకున్న వాడిని మూడు రోజులు లోకల్ రైల్వేస్టేషన్ ని శుభ్రం చేయమని శిక్ష వేసింది. తిక్క కుదిరింది.

⚠⚠ఏదయినా చేసే ముందు కాస్త ఆలోచించి చేయమన్నారు పెద్దలు. జాగ్రత్త వహించండి.


🚫🚫పాఠకులకు గమనిక ఈ ఆర్టికల్ సారాంశం ఇలాంటి ఛాలెంజ్ లు ప్రోత్సహించడం కాదు.

No comments:

Powered by Blogger.