వేసవి జర జాగ్రత్త ! .. మీ కోసం



గడిచిన సంవత్సరాల తో పోలిస్తే క్రమేనా ఎండలు పెరుగుతూ వస్తున్నాయ్. దీనికి కారణం అభివృద్ధి పేరిట జరుగుతున్న పర్యావరణ కాలుష్యం.
వీటిలో కూడా రోడ్లన్నీ కప్పేయడం, పరిశ్రమలు ఇబ్బడిముమ్మడి గ కట్టేయడం ముఖ్య కారణాలు.

ఏది ఏమైనా ఇలాంటి వేసవి నుండి మనం మనల్ని కాపాడుకోవడం మన బాధ్యత.

ఆహార పద్ధతులు కొన్ని వేడి తపాన్ని తగ్గిస్తాయి.
అవి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

ఈ వేసవి లో టీ, కాఫీ లకు బదులు రాగి మాల్ట్ ఉత్తమం.మార్కెట్ లో నాణ్యమైన రాగులు దొరుకుతాయి. ఈ వేసవి లో ఉదయం, సాయంత్రం తాగండి , ఆరోగ్యం, పౌష్టిక విలువలు కూడా శరీరానికి అందుతాయి.


Pc:https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhLlpRNe2mXUOMTPsmtPRdn38GPvx4BjczsZ-BGPmA_zMMlf2dcJzy6lCWbj-yhCjedARErLzTQpH5hGhPIq5XBrZER97RFOFetMI0b8jY7IAaVZiZMFc7xcffjQ-N19cYZ8c_ldfBaOtmJ/s1600/finger-millet.jpg

సాంప్రదాయ భోజనాలయిన సంకటి ల లో రాగి సంకటి ఈ వేసవి లో తినండి . కడుపుకి చల్ల ని ఇస్తుంది.ఈ మండే వేసవి ని భరించే శక్తీ వస్తుంది.




PC:https://www.tripadvisor.com/LocationPhotoDirectLink-g297628-d8419948-i155386621-Rayalaseema_Ruchulu-Bengaluru_Bangalore_Karnataka.html


తరచుగా మజ్జిగ , పెరుగు లని రోజు తప్పకుండ తీసుకోండి .శరీరం లో నూనె విలువలు పెంచడమే కాకుండా చల్లటి ఫీలింగ్ కూడా ఇస్తుంది.



Pc: http://www.chefandherkitchen.com/2012/05/neer-mor-spiced-buttermilk-chaas.html?m=1

చెరకు రసం , పండ్ల రసాలు విరివి గ తీసుకోండి, ఇవి  తాగేముందు, అందులో వాడె కృతిమ తీపి పదార్థాలు , ఐస్ క్యూబ్స్ నాణ్యమైనవా లేదా అని చూసుకుని తాగండి.



PC:https://www.google.co.in/amp/utter.bewakoof.com/posts/7-benefits-of-sugarcane-juice-that-nobody-has-told-you/amp


ఇవి ప్రతి వేసవి లో తమని తాము త్యాగం చేసుకుని మనిషికి తక్షణ ఉపశమనం ఇస్తాయి, అవే పండ్లు 
ఇందులో ముఖ్యం గా కళింగర (పుచ్చ), కర్బూజా,ద్రాక్ష,ఆరంజ్ పండ్లు ఎప్పటికప్పుడు తప్పకుండ తినండి.


PC:http://hipnewjersey.com/national-watermelon-day/

అన్నిటికంటే ముఖ్యం గ ఆరు లేదా ఏడు లీటర్ల మంచి నీరు తాగండి ఉత్తమం. 

ఈ వేసవి మీకు ఆరోగ్యం ,ఆనందం కలగాలి. మళ్లీ ఇంకో ఆర్టికల్ తో మళ్ళీ కలుద్దాం!

తప్పకుండా షేర్ చేయండి. !!


No comments:

Powered by Blogger.