అద్భుతం రామ నామం ! .. నంద్యాల కోటేష్ గారి రామ భక్తి.. రామ నవమి విశిష్టత



రామ నవమి విశేషం!:

చైత్ర మాసం లో 9 వ తేదీని హిందూ మతం లో చేసుకునే అతి అత్యంత భక్తి శ్రద్హాలతో జరిపే పండుగ.

రామ నవమి , మహా విష్ణువు అవతారాల లో 7 వ అవతారం రాముడి జన్మ.
దశరథ మహారాజు, కౌసల్య దంపతుల ముద్దు బిడ్డ. అయోధ్య రారాజు..

వైష్ణవ మత సంబంధ ఆచారాలలో ఈరోజు ఒక గొప్ప రోజు గ భావించి పూజలు చేస్తారు. భద్రాచలం లో జరిగే సీతారాముల కళ్యాణం విశేషం.

బెల్లం ,మిరియాలతో కలిపిన పానకం మహా ప్రసాదం గ స్వీకరిస్తారు.

మగవాడి గుణాన్ని, శ్రీ రాముడి గుణం తో పోల్చడం, ఆడవారి గుణం ని సీతా దేవితో పోల్చడం పరిపాటి .

ఏమైనా , సీతా రాములు లోక కళ్యాణమ్ కోసం మనిషి జన్మ లు ఎత్తి సమస్త జనాలకి జీవన విధానం నేర్పించారు.

మన నంద్యాల చిత్రకారుడు కోటేష్ గారి ఆలోచన సృజనలో కలగలిపిన చిత్ర రామాయణం క్లుప్తం గ ఒక చిత్రం లో ..


రామాయణం ఒక మహా గ్రంధం   . అలంటి గొప్ప కథని చిన్న చిత్రం రూపం లో చిత్రించడం గొప్ప విశేషం. పొగడ్తకి సమయం ఇదే కనుక ఈ రోజు మన బ్లాగ్ లో రాయడం జరిగింది.

చిత్రకారుడు కోటేష్ గారి పై అలాగే మన అందరికి రాముని కృప ఎల్లప్పుడు ఉండాలని కోరుతూ..

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !

జై శ్రీరామ్..

గొప్ప చిత్రకారుడు మన జిల్లాలో ఉండడం గొప్ప విషయం.

కావున కేవలం చదివి వదలకుండా ఫేసుబుక్, మరియు సోషల్ మీడియా లో విస్తృతం గ షేర్ చేసి మన జిల్లా గొప్ప తనం , చిత్రకారుడి కోటేష్ గారి గొప్పతనం , రాముడి అపురూప చిత్రం అందరికి తెలిసే ల చేయండి.

జై శ్రీరామ్!!

No comments:

Powered by Blogger.