ఓటమి నుంచి నేర్చుకోవడం ఆంటే ఏమిటి ?



గొప్ప వక్త లు చాలా ఈజీ గా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి అని చెప్తారు. అది ఎలాగో ఒక ఉదాహరణ ద్వార చూద్దాం.

ఒక పల్లెటూళ్ళో ఒక టోపీలు వర్తకుడు ఉండేవాడు. తను విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద పడుకుంటాడు. లేచే సరికి అతని టోపీలన్ని కోతుల మూక తీసుకుని చెట్టు పై ఉంటాయి. కలత చెందిన తను , ఎం చేయాలో పాలు పోక తల గోక్కోడం చేస్తాడు. ఇంతలో కోతులు కూడా తల గోక్కుంటాయి.వర్తకుడు , కోతులు మనిషి ఎం చేస్తే అవి కూడా అలానే చేస్తాయి అని గ్రహించాడు. వర్తకుడు చాలా తెలివిగా తన టోపి తీసి విసిరిపారేస్తాడు. అన్ని కోతులు కూడా అలానే విసిరేస్తాయి. అన్ని తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు. వర్తకుడి తెలివికి కోతులు అవక్కయ్యాయి.

కాలం మారిపోయింది , వర్తకుడు తన మనవడికి జరిగింది చెప్పాడు. కానీ కాలం మరినప్పటికి మనకు జరిగిన సంఘటనలు మళ్ళీ జరగవచ్చు .

ఈసారి కూడా తన మనవడి టోపీలు కోతులు తీసుకుని చెట్టు పైకి వెళ్లిపోతాయి. కానీ వర్తకుడు భయం లేకుండా టోపి తీసి విసిరేస్తాడు. కానీ ఒక కోతి దిగి వర్తకుడి  టోపి తీసుకుని , ఓరి వెర్రి! నాగన్న నీకు తాత ఉన్నట్లే మాకు కూడా తాతలు ఉండరా ఏంటి అని చూసి వెళ్లిపోతాయి. ఈసారి అవాక్కవ్వడం వర్తకుడి వంతయ్యింది.

సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే , ప్రయత్నం లో అపజయాలు సాధారణం , కానీ వాటిని మళ్ళీ పునరావృతం కాకుండా తెలివిగా విజయం సాధించాలి.

మీకు ఈ కథ నచ్చినట్లయితే మీ email ద్వారా సబ్స్క్రయిబ్ అవ్వండి.

#source: నింగికి నిఛ్హెన

Facebook లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి.

2 comments:

  1. పాపం మనవడు!
    తాత దగ్గర్నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు గానీ
    కోతులకన్నా ముందే అప్డేట్ చేసుకోలేకపోయాడు.
    పోన్లెండి, ఈ ఓటమి నుంచి నేర్చుకుంటాడని ఆశిద్దాం.
    చిన్న చిన్న పదాలతో చక్కని పోస్ట్ లను వ్రాసి
    అలరిస్తున్నారు. అభినందనలు. :)

    ReplyDelete
  2. 😂😂😂 చాలా థాంక్స్ nmrao bandi గారు.

    ReplyDelete

Powered by Blogger.