ఆలోచన అదిరేలా ఉండాలి}..విజయం మనదే అవుతుంది..తెలివి పుట్టుకతో రాదు , అలా అని మనకి ఉండదు అనేం కాదు. కొన్ని సమయాల్లో అదే బయట పడుతుంది.

అందుకు ఒక ఉదాహరణ
..

ఒకరోజు ఒక గొప్ప భారతీయ వ్యాపార వేత్త విదేశాల్లోని తన బ్యాంక్ దగ్గరికి వెళ్లి మేనేజరు తో ఇలా అన్నాడట..

మేనేజరు గారు నాకు $5000 డాలర్ లు అప్పుగా కావాలి. దానికి తాకట్టు గా బ్యాంక్ నియమాల ప్రకారం నా కారు ఉంచుతున్నాను."

అందుకు ఆ మేనేజర్ ఇతని వైపు చూసి , ఇతనికి ఏమైనా పిచ్చ , $5000 డాలర్ స్ కి అత్యంత విలువైన ఫెరారీ కారు ఉంచుతున్నారు అని $5000 డాలర్ స్ ఇచ్చి , కార్ ని డైరెక్ట్ గా బాంక్ గ్యారేజ్ లో తీసుకెళ్లి పెట్టారు.

ఇదిలా ఉండగా , వ్యాపారవేత్త ఒక నెల తర్వాత వచ్చి $5000 డాలర్ స్ తిరిగి ఇచ్చి నెలకు వడ్డీకి గాను $15.40 డాలర్ స్ ఇచ్చేసి కార్ ని తీసుకున్నాడు..


వెళుతున్నపుడు , బ్యాంక్ మేనేజరు ఆసక్తి గా అడిగాడు , సర్ మీరు గొప్ప వ్యాపార వేత్త , కానీ మీరు $5000 డాలర్ స్ మాత్రమే తీసుకున్నారు, మీరు పెట్టిన కార్ కి అంతకంటే ఎక్కువ అప్పు తీసుకోవచ్చు , కానీ ఎందుకు ఇలా అని అడిగాడు.

అప్పుడు వ్యాపారవేత్త} ఏమన్నాడంటే నా కార్ పార్కింగ్ కి నెలరోజుల పార్కింగ్ ఖర్చు $15.40 కంటే ఎక్కువగా ఉంటుంది. అని వెళ్లిపోయడంట.

అర్తం చేసుకున్న మేనేజరు ఆశ్చర్యపోయాడు .


ఆ వ్యాపార వేత్త ఎవరో కాదు , విజయ మాల్యా..

ఈయన ఎవర్ని మోసం చేసిన పర్లేదు . కానీ కన్నా దేశానికి మోసం చేసినవాడు. గొప్ప వాడు కూడా దౌర్భాగ్యుడే....

నచ్చితే షేర్ చేయండి...

#source: నింగికి నిఛ్హెన

No comments:

Powered by Blogger.