తల్లి పాలకు లోకం లో దేనిని సరిపోల్చలేము!

Breastfeeding weekend


There is no substitute for mother's milk. ~Martin H. Fischer (1879–1962)

తల్లి పాలు బిడ్డకు దేవుడు ఇచ్చిన మొదటి వరం. అమ్మ బిడ్డకు ఇచ్చే మొదటి ప్రేమతో నిండిన వరం అని కూడా చెప్పవచ్చు. ఏ వస్తువు ఇచ్చినా ప్రేమ ఉంటుందో లేదో తెలీదు కానీ, బిడ్డకు తల్లి ఇచ్చే పాలలో అతి మధురం తో పాటు మధుర ప్రేమ కూడా కలిసి ఉంటుంది.

తల్లి ప్రేమతో ఇస్తున్నకొద్ది బిడ్డ తన ఆకలిని తీర్చుకుని అలాగే నిద్రపోయే తరకమంత్రమా అన్నట్లు ఉంటుంది.

వరల్డ్ హెల్త్ ఆర్గ నైజషన్ (W.H.O) ప్రకారం ప్రతి 5 మంది పసి పిల్లల్లో 3 గ్గురికి మాత్రమే తల్లి పాలు మొదటి నెలకు అందుతున్నాయి. పిల్లల ఎదుగుదలకు మానసిక వికాసానికి తల్లి పాలు కనీసం 2 ఏళ్ళు ఉండాలి.

మారిపోతున్న కాలానుగుణంగా పిల్లలకు తల్లులు పాలు ఇవ్వడం ఎదో అనగారికం గా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే పాలు సరిపోవట్లేదు అంటారు. తల్లి పాలు ఇచ్చే కొద్దీ కొత్తపాలు తిరిగి ఉత్పత్తి అవుతాయి. పిల్లలకు మీరు మీ ప్రేమ ను కలిపి పాలను పట్టాలి. డబ్బాలు,పూపాలు వీటితో పిల్లల ఎదుగుదల ఉంటుంది కానీ బుద్ధిమాంద్యం వస్తుంది.

 పిల్లలకి ఉన్నతమైన భవిష్యత్తు అందించాలి, అది అమ్మ చేతిలో అమ్మ ప్రేమతోనే సాధ్యం.

ముర్రుపాలు వలన బిడ్డకు కలిగే లాభాలు:


1.బిడ్డకు తక్షణ శక్తి, కావలిసిన న్యూట్రియాన్స్ లభిస్తాయి.
2.రోగ నిరోధక శక్తి మెరుగుగ్గా ఉంటుంది.
3.క్రానిక్ వ్యాధుల బారి పడకుండా బిడ్డ ఆరోగ్యం గా ఉంటుంది.
4. విరేచనాలు,నుమోనియా వంటి విష జ్వరాలు రాకుండా ఉంటాయి.
5.ముఖ్యం గా తల్లీ బిడ్డ మధ్య ప్రత్యేక ప్రేమ బంధం అలవడుతుంది.

ప్రతిజ్ఞ:- పెద్ద చదువులు, పెద్ద ఉద్యోగాలు మాత్రమే నాగరికత కాదు , పిల్లలకు ఇవ్వాల్సిన పాలు వాళ్లకు ఇవ్వాలి విధిగా, స్టైల్ అని డబ్బా పాలు ఇవ్వను, మంచి ఆహారం తీసుకుని బిడ్డకు పాలు ప్రేమతో ఇస్తాను. ఏయ్ సందర్భం లో అయినా బిడ్డకు బహిరంగ ప్రదేశాల్లో సైతం బిడ్డకు పాలు ఇవ్వటానికి సిగ్గుపడను.

ఆర్టికల్ నచినట్లయితే షేర్ చేయగలరు..

#breastfeeding, #lactation , world breastfeeding week

Pic credits #pixbay

No comments:

Powered by Blogger.