ఏయ్ గొట్టం ఎం అనుకుంటే నాకేం!

Honour killing

అవును ఏయ్ గొట్టం గాడు ఎం అనుకుంటే నాకేం! అని అనుకునే వ్యక్తులు ఎంతమంది సమాజం లో, ఇలా అనుకుని జీవితాల్లో వెలుగులు నింపుకోవచ్చు.

ఎవడో ఎదో అంటాడు అని, ఆత్మహత్య చేసుకోవడం ??
ఎవడో ఎదో అంటాడు అని, మనిషి ని కోపం తో చంపడం??

ఇక్కడ ఇగో విషయం,, పని చేస్తే మెచ్చుకోవలనుకోవడం,ఎక్సమ్ రాస్తే మంచి రిసల్ట్ వస్తే పొగుడుతారని ఇగో, నా కూతురు నాకు తగ్గ , నా కంటే ఎక్కువ స్టేటస్ ఉన్న వాడికి ఇచ్చి న పరపతి ఇంకా పెంచుకోవాలని ఇగో (ఇక్కడ అమ్మాయి ఇష్టా ఇష్టాలతో పని లేదనుకోండి)..

కొంత సమాజం లో బ్రతుకుతున్నందుకు, ఎవరికోసమో కాకుండా నీ కోసం బ్రతకడం నేర్చుకో!! నీ ఇంటి వాళ్ళ కోసం బ్రతుకు, పక్కింటోడు అనుకుంటాడాని, చీప్ అయిపోతాము అనుకుని నీకు నువ్ గీత గీసుకుని చట్రం లో బ్రతకకు..

చిన్న కథ విను చెప్తా!!

Pranay amrutha love

ఇంటి అవసరాల కోసం భార్యాభర్తలు ఇద్దరు గాడిదని కొనాలని పట్నం లోని సంతకి పోతారు, వెళ్ళాక మంచి గాడిదని కొంటారు, కొని ఇంకా ఉరికి బయలుదేరుతారు.

ఇక్కడే అసలు కథ మొదలు అవతాది,

తాడు కట్టి మాట్లాడుతూ నడుస్తూ కబుర్లు చెప్తూ వస్తుంటారు, దారిన పోయే ఒకడు (వీడిని గుర్తుపెట్టుకోండి) వీళ్ళని చూసి ఇలా అంటాడు!

"ఎందయ్య ! ఒట్టి వెర్రోళ్ల లా ఉన్నరే!! గాడిదను నడిపిస్తూ మీరు నడుస్తున్నారు, వట్టి దండగ గాడిదలు వలె ఉన్నారే అంటాడు."

అప్పుడు ఇద్దరు వాడి మాటలు సీరియస్ గా తీసుకుని ఇద్దరు ఒక నిర్ణయానికి వస్తారు!

"అవునే, నువ్ అయినా  గాడిద పైన ఎక్కు నేను నడుస్తూ వస్తాలే అంటాడు మొగుడు!" మొగుడు మాట తూ. చ తప్పకుండా పాటిస్తుంది ఆవిడ..

కొంత దూరం ఇంకొక ఆవిడ ఎదురు అవుతుంది(ఈమేని గుర్తుంచుకోండి) ఆవిడ అంటుంది..

"ఎమ్మా ఏయ్ కాలం లో ఉన్నావ్, మొగుడు నడుస్తూ వస్తుంటే ,నువ్ గాడిదలా , గడిదపై ఊరేగుతూ వస్తావా" అని చెప్పింది!

అంతే ఇక వెంటనే దిగి , పతి ప్రేమ తో ఇది నిజమే అని మొగుడిని గాడిదని ఎక్కించి నడుస్తూ వస్తుంది..

అలా పోతుంటే ఇంకొడు ఎదురయ్యాడు(గుర్తు పెట్టుకోండి).. వాడు అన్నాడు ఏమయ్యా వట్టి అహంకారి భర్తలా ఉన్నవే, భార్యని నడిపిస్తూ గాడిదల ఉరేగుతున్నావ్ అని అన్నాడు, వెంటనే దిగాడు..

ఎం చేద్దాం అని నిర్ణయానికి వచ్చి గాడిదని కింద పడేసి రెండు కాళ్ళు కట్టేసి , ఒక నాటు కట్టె వేసి చెరొక వైపు ఎత్తుకుని నడవసాగారు!!

ఎలాగూ ఊరు వచ్చింది,, ఊర్లో జనం చూసి వట్టి గాడిద లు మీరు గాడిద ని వాడుకోవాలి కానీ, గాడిద లాగా మోసుకొస్తారా అన్నారో!! ఎం చేయాలో అర్థం కాలేదు ఆ భార్యాభర్తల కు!!

ఇక్కడ గమనించాల్సిన విషయం వాళ్ళ కు వాళ్ళ అవసరం తెలుసు సమాజం లో మనుషుల ను పట్టించుకుంటు పోతేయ్ చివరకు గాడిదలు గా మరిపోతాం.

సో , చెప్పేది ఏంటి అంటే . మీకు ఏదయినా మీ ఇంట్లో వాళ్ళు చేసింది నచ్చకపోతే అజ్ఞాతం లోకి వెళ్లి సన్యాసం తీసుకో , లేదంటే వాళ్ళని అర్థం చేసుకోడాని try చేయండి. అంతే కాని పనికి మాలిన జనాలను గుర్తుపెట్టుకొని , వాళ్లకు తగ్గట్లు బ్రతకడం నీ మురుకత్వం!!

ఎం సాధించారు కులం, పరువు అని, కడుపు లు తెచ్చుకుని వదిలేయలేదు కదా, చావో రేవో ఉన్నతం గా నే బ్రతుకుదాం, సమాజం మమ్మల్ని accept చేస్తాది అనే నమ్మకం తో అడుగు వేశారు.. చూడ ముచ్చట జంట ని చూసి మురిసిపోవాల్సింది పోయి, నేను తిరగలేను సమాజం లో అని , చంపి నువ్ సాధించిన గాడిద గౌరవం ఏముంది ,... గడిదల్లారా!!

పిల్లల్ని అర్థం చేసుకున్న ప్రతి తల్లితండ్రులకు నా గౌరవ అభినందనలు.. సమాజం లో బ్రతకాలి కానీ , సమాజం లో మెదళ్లలో విషం నింపే సమాజం కోసం బ్రతకావద్దు!!

2 comments:

  1. Problemsolutionastrologer - The goal with which the spell inserted should be good for like a vashikaran specialist in New Zealand.

    More updates about Vashikaran Specialist in New Zealand

    ReplyDelete
  2. Durga Saffron - We are leading and dealing in good quality, original, organic, pure best quality saffron online in Punjab, more to visit our website.

    More updates about Durga Saffron

    ReplyDelete

Powered by Blogger.